టెలికాం కమ్యూనికేషన్ రంగంలో అతి పెద్ద మొబైల్ ఆపరేటర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ఈ ఏడాది జనవరికి 1.6 మిలియన్‌ల మొబైల్ వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకుంది. దీంతో రిలయన్స్ సంస్థకు ఉన్న వినియోగదారుల సంఖ్య 42.6 మిలియన్‌లకు చేరుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.
సీడీఎంఏ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సేవలందించే రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు జీఎస్ఎం టెక్నాలజీ ఉన్న సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే తాజాగా వెలువడిన ఈ గణాంకాలతో జీఎస్ఎం టెక్నాలజీతో సేవల విభాగంలో రిలయన్స్ సంస్థ ఆధిపత్య దిశగా వెలుతోందని ప్రతినిధి పేర్కొన్నారు.
కాగా, 80 మిలియన్ల మొబైల్ వినియోగదారులతో ప్రపంచ టెలికాం మార్కెట్‌లో భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. ఇప్పటికే మొబైల్ వినియోగదారుల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కునెట్టింది. మరో మూడు నెలల కాలంలో రెండో స్థానంలో ఉన్న అమెరికాను కూడా భారత్ వెనక్కి నెట్టగలదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
|