ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
క్రిస్లర్‌తో టీసీఎస్ బహుళ వార్షిక కాంట్రాక్టు
ప్రముఖ ఆటోమోటారు కంపెనీ క్రిస్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రముఖ ఐటీ సేవా రంగ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ ప్రకటించింది. తమ సంస్థకు చెందిన విస్తృతమైన ఐటీ సేవలను క్లిస్లర్ సంస్థకు అందించనున్నట్లు పేర్కొంది.

అప్లికేషన్ మెయింటెనెన్స్, సపోర్ట్ సర్వీసెస్ వంటి సేవలను క్లిస్లర్‌కు టీసీఎస్ అందించనుంది. ఈ ఒప్పందంతో క్లిస్లర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో టీసీఎస్ సంస్థకు చెందిన ఐటీ సేవలు కూడా ఒక భాగం కానున్నాయి. సేల్స్, మార్కెటింగ్, భాగస్వామ్య సేవలు, తదితర విభాగాల్లో టీసీఎస్ కీలకంగా ఐటీ సేవలు అందించనుంది.

అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇరు కంపెనీలు చేసుకున్న ఈ బహుళ వార్షిక కాంట్రాక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థలు వెల్లడించకపోవడం గమనార్హం.
మరిన్ని
పెరిగిన రిలయన్స్ మొబైల్ వినియోగదారులు
వక్సీ నగరానికి భారత ఐటీ కంపెనీలు
ఒరాకిల్‌కు బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు
త్వరలో 'వెబ్‌దునియా' క్రీడా పోర్టల్
మొబైల్ వినియోగదారుల్లో అగ్రపథాన భారత్
భారీ ఒప్పందాలపై ఇన్ఫోటెక్ కన్ను