ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేరళ: అన్ని జిల్లాల్లోను ఐటీ పార్కులు
కేరళలో అన్ని జిల్లాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సుమారు లక్షకు పైగా ఉద్యోగావకాశాలు ఏర్పడుతాయని.. రాష్ట్రహోం మంత్రి కొడియేరి బాలక్రిష్ణన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీలో తెలియపరిచారు.

తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళి సిద్ధం చేసిందని.. అసెంబ్లీలో సీపీఐ నేత ఎన్ అనిరుద్ధన్ మరియు ఇతరులు అడిగిన ఓ ప్రశ్నకు బాలకృష్ణన్ ఈ మేరకు సమాధానమిచ్చారు.

ఐటీ రంగంలో మరో మూడేళ్లలో లక్షకుపైగా ఉపాధి అవకాశాలను కల్పించనున్న కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (కేఎస్ఐటీఐ) ప్రాజెక్టును ఇప్పటికే ప్రభుత్వం ఆచరణలో పెట్టిందని.. ఆ రాష్ట్రముఖ్యమంత్రి తరుపు ప్రతినిధిగా బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఐటీ పార్కుల ఏర్పాటులో అన్ని జిల్లాల నుంచి తమకు సలహాలు, సూచనలు వచ్చాయని... అలాంటివి మరిన్ని తమకు అందజేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
మరిన్ని
మౌళిక సదుపాయాల భాగస్వామ్యం: మిట్టల్
క్రిస్లర్‌తో టీసీఎస్ బహుళ వార్షిక కాంట్రాక్టు
పెరిగిన రిలయన్స్ మొబైల్ వినియోగదారులు
వక్సీ నగరానికి భారత ఐటీ కంపెనీలు
ఒరాకిల్‌కు బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు
త్వరలో 'వెబ్‌దునియా' క్రీడా పోర్టల్