ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించిన సిమాన్‌టెక్
సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ, స్టోరేజీ అండ్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్‌లో అగ్రస్థాపధాన ఉన్న సంస్థ సిమాన్‌టెక్ కార్పోరేషన్ కంపెనీ.. తన కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. ఈ సాఫ్ట్‌వేర్ రికవరీతో పాటు బ్యాకప్ వంటి సదుపాయాలను కూడా కలిగి ఉందని సిమాన్‌టెక్ వెల్లడించింది.

ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ 2008ను లక్ష్యంగా చేసుకుని ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్లు సిమాన్‌టెక్ పేర్కొంది. న్యూఢిల్లీలో సోమవారం ఓ సదస్సులో సిమాన్‌టెక్ (ఇండియా) డైరెక్టర్ (ఛానెల్స్ అండ్ అలయెన్సెస్) అజయ్ వర్మా మాట్లాడుతూ సిమాన్‌టెక్ బ్యాకప్ ఎక్సెక్ 12 అనే ఈ సాఫ్ట్‌వేర్ డేటాకు రక్షక కవచం లాంటిదని తెలిపారు.

కొద్ది సెకనుల్లోనే ఈమెయిల్ రికవరీ, షేర్ పాయింట్ సర్వీసులు, యాక్టివ్ డైరెక్టరీ డేటా వంటివి తిరిగి పొందవచ్చన్నారు. కాగా, ఈ అమెరికా ఆధారిత కంపెనీ సుమారు 40 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని దేశాల్లోను ఈ సాఫ్ట్‌వేర్ లభ్యమవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
మరిన్ని
కేరళ: అన్ని జిల్లాల్లోను ఐటీ పార్కులు
మౌళిక సదుపాయాల భాగస్వామ్యం: మిట్టల్
క్రిస్లర్‌తో టీసీఎస్ బహుళ వార్షిక కాంట్రాక్టు
పెరిగిన రిలయన్స్ మొబైల్ వినియోగదారులు
వక్సీ నగరానికి భారత ఐటీ కంపెనీలు
ఒరాకిల్‌కు బీఎస్ఎన్ఎల్ కాంట్రాక్టు