ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆపిల్ లాప్‌టాప్‌తో లెనోవా పోటీ
చైనాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవా తన పోటీదారు అయిన ప్రముఖ కంప్యూటర్ మరియు సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్‌ కంపెనీకి అధికారిక సవాలు విసిరింది. ఆపిల్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ కంప్యూటర్‌ కంటే తమ సంస్థకు చెందిన థింక్‌పాడ్ X300 మేలైనదని పేర్కొంటోంది.

తక్కువ బరువు గలదిగా ఆపిల్ విడుదల చేసిన లాప్‌టాప్ కంటే తాము విడుదల చేసిన థింక్‌పాడ్ X300 ఆల్ట్రా-పోర్టబుల్ మెషీన్ కేవలం 2.93 పౌండ్లు మాత్రమేనని లెనోవా వెల్లడించింది. అంతేగాక విశేష లక్షణాలు గల అంశాలెన్నో ఈ లాప్‌టాప్‌ ద్వారా అందిస్తున్నట్లు లెనోవా తెలిపింది.

అలాగే ఈ నోట్‌బుక్‌లో మూడు యూఎస్‌బీ పోర్ట్‌లు, డీవీడీ రైటర్.. ఇస్తున్నమని చెబుతూ... ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్‌ నోట్‌బుక్‌లో ఒక యూఎస్‌బీ పోర్ట్ మాత్రమే కలిగి ఉందని వ్యాఖ్యానించింది.
మరిన్ని
యూబీఐతో 3ఐ ఇన్ఫోటెక్ ఒప్పందం
వైమాక్స్‌లో టాటా కమ్యూనికేషన్స్ పెట్టుబడి
ప్రపంచంలోనే అతి చిన్న పర్సనల్ కంప్యూటర్
అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం: ఎయిర్‌టెల్
ఇకపై రిజర్వేషన్‌కు ఐటీ సొగసులు
కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించిన సిమాన్‌టెక్