ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోల్‌కతాలో తొలి స్వదేశీ చిప్ డిజైనింగ్ హబ్
దేశంలోనే తొలిసారిగా స్వదేశీ సెమీకండక్టర్ పరిశోధనా కేంద్రం, చిప్ డిజైనింగ్ హబ్‌ కోల్‌కతాలో స్థాపించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.100 కోట్లతో నెలకొల్పనున్నారు. ఇండియా డిజైన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో నెలకొల్పబోతున్న ఈ కేంద్రానికి పశ్చిమ బెంగాల్ సమాచార శాఖా మంత్రి డాక్టర్ దేబేష్ దాస్ మంగళవారం శంఖుస్థాపన చేశారు.

కోల్‍‌కతాలోని సాల్ట్ లేక్ ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్‌లో 1.7 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పరిశోధనా కేంద్రం 20 అంతస్తులు కలిగి ఉంటుంది. మొత్తం వైశాల్యం 250,000 చదరపు అడుగులు. రూపకల్పనకు, టెస్టింగ్‌కు, నమూనా తయారీకి తగిన వసతులను ఇండియా డిజైన్ సెంటర్‌ సెమీకండక్టర్ చిప్ కలిగి ఉంది. వచ్చే 2009 నాటికి ఈ కేంద్రం నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి దాస్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన కాన్సెప్ట్ నోట్‌ను ఖర్గపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపొందించిందని మంత్రి దాస్ వివరించారు.
మరిన్ని
రామ్ చేతికి 'స్మార్ట్ బ్యాంకర్' సాఫ్ట్‌వేర్ ఆర్డర్
కేరళలో త్వరలో ఉచిత సాఫ్ట్‌వేర్ కేంద్రం
ఆరెంజ్ సేవలను ఆందించనున్న రిలయన్స్
సోనీవారి సరికొత్త హెడ్‌ఫోన్
గిగాబైట్ ఎనర్జీ సేవింగ్ మధర్‌బోర్డ్‌లు
సెల్‌ఫోన్ ఛార్జీలను తగ్గించనున్న బిఎస్ఎన్ఎల్