ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారీగా పెరగనున్న సెల్‌ఫోన్‌ల విక్రయం
జపాన్ మినహా మిగిలిన ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో 2008లో మొబైల్ వాడకం సుమారు 400మిలియన్‌లకు పైగా పెరుగనున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. పదిశాతానికి పైగా వార్షిక పెరుగుదల ఉండే అవకాశాలున్నట్లు ఈ నివేదికలు తెలుపుతున్నాయి.

ఈ నివేదికల ప్రకారం ముఖ్యంగా భారత్, చైనా తదితర దేశాల్లో ఈ వృద్ధి రేటు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2007లో మొత్తం 366 మిలియన్ యూనిట్ల విక్రయం జరుగినట్లు ఐడీసీ తన నివేదికలో తెలిపింది. ఇందులో అరవైశాతం భారత్, చైనాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ ఏడాది ఇరు దేశాల్లో మొబైల్ రంగం అరవైశాతం డిమాండ్ ఉందని... ఈ లెక్కల ప్రకారం మొబైల్ రంగం త్వరితగతిన విస్తృతంగా విస్తరించగలదని ఈ అంశంపై పరిశోధించిన సంస్థ అభిప్రాయ పడింది.
మరిన్ని
బయోటెక్ హబ్‌గా భారత్: సిబాల్
కోల్‌కతాలో తొలి స్వదేశీ చిప్ డిజైనింగ్ హబ్
రామ్ చేతికి 'స్మార్ట్ బ్యాంకర్' సాఫ్ట్‌వేర్ ఆర్డర్
కేరళలో త్వరలో ఉచిత సాఫ్ట్‌వేర్ కేంద్రం
ఆరెంజ్ సేవలను ఆందించనున్న రిలయన్స్
సోనీవారి సరికొత్త హెడ్‌ఫోన్