ప్రముఖ కంప్యూటర్ల తయారీ ఉత్పత్తి సంస్థ హెవ్లెట్ పాకార్డ్ (హెచ్‌పీ) కార్పొరేషన్ కంపెనీ ప్రత్యేకించి చిన్న పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ను తయారు చేయనుంది. 'మినీ నోట్'బుక్ పేరుతో తయారు కానున్న ఈ ల్యాప్‌టాప్‌ను త్వరలోనే తయారు చేయనున్నట్లు హెచ్‌పీ వెల్లడించింది.
వచ్చే నెలలోగా దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. ఈ ల్యాప్‌టాప్‌లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ను కూడా తీసుకువస్తామని హెచ్‌పీ సంస్థ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో విస్తా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెడతామని వివరించింది.
కేవలం 1 1/2కేజీల బరువు ఉండే ఈ ల్యాప్‌టాప్ స్క్రీన్ వైశాల్యం 22.6 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే ప్రారంభ ధరగా 500 డాలర్లను నిర్ణయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
|