యూఎస్‌కు చెందిన పెలాగో ఇంటర్నేషనల్ సంస్థలో రిలయన్స్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ టెక్నాలజీ వెంచర్స్ లిమిటెడ్‌కు చెందిన విభాగం రిలయన్స్ క్యాపిటల్. పెలాగో కంపెనీలో ఎంతమేర పెట్టుబడులు పెట్టారన్నదానిపై వివరాలు తెలియరాలేదు.
భారతదేశానికి చెందిన యాత్రా.కామ్ సంస్థలో కూడా రిలయన్స్ క్యాపిటల్ పెట్టుబడులు పెట్టింది. పెలాగో సంస్థ 2006లో ఏర్పాటుచేశారు. పెలాగో కంపెనీ అమజాన్.కామ్‌కు చెందినది. ఇందులో క్లినర్ పెర్కిన్స్ కౌఫీల్డ్ అండ్ బేయర్స్, ట్రిలోజీ ఈక్విటీ పార్టనర్స్, బెజోస్ ఎక్స్‌పెడిషన్స్‌లు పెట్టుబడులు పెట్టాయి.
|