ఇంటెల్ కంపెనీ మలిదశ వైర్‌లెస్ జనరేషన్ చిప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రపంచ పీసీల విక్రయ మార్కెట్‌లో ఇంటెల్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మలిదశ వైర్‌లెస్ చిప్‌కు సెంట్రినో2గా పేరుపెట్టారు. కొత్త చిప్ రాక కారణంగా మొబైల్ టెక్నాలజీస్ రంగంలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఇంటెల్ గతంలో విడుదల చేసిన చిప్ పేరు మోంటివినా. సెంట్రినో రకం చిప్స్‌ను ఇంటెల్ కంపెనీ 2003 నుంచి ఉత్పత్తి చేస్తుంది. ఇంటెల్ విడుదల చేసిన కొత్త చిప్ సెంట్రినో2లో వీ-ఫీ కేపబిలిటీ కూడా ఉంది. 100 మీటర్లు లోపున ఎటువంటి వైరు లేకుండా ఇంటర్నెట్ సేవలను వినియోగదారులు తమ లాప్‌టాప్ ద్వారా పొందవచ్చు. వీ-ఫీ కేపబలిటీ ఉన్న కొత్త చిప్ ద్వారా వినియోగదారులు వేగవంతంగా ఇంటర్నెట్ సేవలు అందుకోవచ్చు.
ఇంటెల్ రూపొందించిన కొత్త చిప్‌ను నోట్‌బుక్ కంప్యూటర్లలో ఎక్కువగా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా రూపొందిస్తున్న తేలికపాటి నోట్‌బుక్‌ల రూపకల్పనలో ఇంటెల్ రూపొందించిన చిప్‌ల వాడకం ద్వారా వేగం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇంటెల్ తైవాన్‌కు చెందిన చిప్‌ల ఉత్పత్తి సంస్థ.
|