ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టెలీ ఎడ్యుకేషన్ సేవలు : బీఎస్ఎన్ఎల్  Search similar articles
వినియోగదారులకు టెలీ ఎడ్యుకేషన్ సేవలను అందిస్తామని ప్రభుత్వ రంగ టెలికాం ధిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తెలిపింది. తమ నుంచి ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందుతున్నవారికి ఈ అవకాశం కలుగుతుందని బీఎస్ఎన్ఎల్ ఉత్తర ప్రదేశ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ చెప్పారు.

ఢిల్లీ ప్రాంతంలో టెలీ ఎడ్యుకేషన్ సేవలను ప్రారంభించాలని బీఎస్ఎన్ఎల్ ఇటీవలే నిర్ణయం తీసుకుందని వివరించారు. తద్వారా విద్యా కార్యక్రమాలతో పాటుగా స్టడీ మెటీరియల్ తమ వినియోగదారులు పొందుతారని తెలిపారు. ఈ సేవలను పొందటానికి వినియోగదారులు నెలకు రూ.250లు చెల్లించాలని కుమార్ వెల్లడించారు.

ప్రభుత్వ రంగ టెలికాం ధిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా విస్తృతంగా నెట్‌వర్క్ కలిగి ఉంది. వినియోగదారులకు కావలిసిన అనేక సేవలను బీఎస్ఎన్ఎల్ సకాలంలో అందిస్తూ వారి మన్ననలను పొందుతుంది. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో టెలికాం టవర్లను బీఎస్ఎన్ఎల్ కలిగిఉంది.
మరిన్ని
పూణెలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ : ఐబీఎం
ఐరోపా సాకర్‌కు టెక్నాలజీ ఫ్రాంటియర్స్ సేవలు
ఆర్‌కాం వినియోగదారుల సంఖ్య 10.74వేలు
గుర్గావ్‌లో ఐటీటీ కాంప్లెక్స్‌లు : హర్యానా
రెండో తరగతి నగరాల్లో ఎల్కాట్ ఐటీ పార్కులు
ముంబయిలో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం