ప్రధాన పేజి   వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దక్షిణ అమెరికాలో ఐటీ అభివృద్ధి కేంద్రాలు  Search similar articles
దక్షిణ అమెరికాలో కార్యకలాపాలను వేగిరం చేసేందుకు వీలుగా ఐటీ అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ సత్యం తెలిపింది. మెక్సికో, చిలీ లేదా ఉరుగ్వేలలో తమ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని సత్యం కంప్యూటర్స్ అధ్యక్షుడు రాం మణ్యంపతి చెప్పారు.

భారతదేశంలో ఐటీ కంపెనీ ధిగ్గజం సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్. తమ కంపెనీ ఈజిప్ట్, బ్రెజిల్, ఆస్ట్రేలియాలలో ఐటీ మరియు బీపీఓలకోసం అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసిందని వివరించారు. వచ్చే త్రైమాసిక కాలాల్లో సత్యం మరింత వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

విదేశీ మార్కెట్లు అయిన అమెరికా, ఆసియాపసిఫిక్, మధ్యప్రాచ్యం, ఐరోపాలలో తమ సేవలకు డిమాండ్ అధికంగా ఉందని వివరించారు. అమెరికా నుంచి 60 శాతం, ఐరోపా నుంచి 19.5 శాతం, మిగిలిన దేశాల నుంచి 20.5 శాతం మేర లాభాలను తాము స్వీకరిస్తున్నామని రాం మణ్యంపతి వెల్లడించారు.
మరిన్ని
టెలీ ఎడ్యుకేషన్ సేవలు : బీఎస్ఎన్ఎల్
పూణెలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ : ఐబీఎం
ఐరోపా సాకర్‌కు టెక్నాలజీ ఫ్రాంటియర్స్ సేవలు
ఆర్‌కాం వినియోగదారుల సంఖ్య 10.74వేలు
గుర్గావ్‌లో ఐటీటీ కాంప్లెక్స్‌లు : హర్యానా
రెండో తరగతి నగరాల్లో ఎల్కాట్ ఐటీ పార్కులు