ఐనాటిక్స్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమిళనాడు రాజధాని చెన్నైలో కేంద్రాన్నిఏర్పాటుచేసింది. ది బ్యాంక్ ఆఫ్ న్యూ యార్క్ మెల్లోన్ కార్పొరేషన్‌కి చెందిన అనుబంధ సంస్థ ఐనాటిక్స్. చెన్నై అసెండాస్ టెక్ పార్క్‌లో ఐనాటిక్స్ కేంద్రం ఏర్పాటుచేశారు.
చెన్నై కేంద్రం ద్వారా 1800 మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలను ఐనాటిక్స్ కల్పిస్తుంది. ఈ ఏడాది చివరినాటికి చెన్నై కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను 2200 మందికి పెంచాలని ఐనాటిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐనాటిక్స్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెక్నాలజీ సర్వీసెస్, బిజినెస్, టెక్నాలజీ ఆపరేషన్స్ వంటి సేవలను తమ అనుబంధ సంస్థలైన పెర్షింగ్ ఎల్ఎల్‌సీ, ది బ్యాంక్ ఆఫ్ న్యూ యార్క్ మెల్లోన్ కార్పొరేషన్‌లకు అందిస్తుంది. పెర్షింగ్ ఎల్ఎల్‌సీ ప్రపంచవ్యాప్తంగా ఫినాన్షియల్ బిజినెస్ సొల్యూషన్స్‌ను వివిధ రకాల 1,150 సంస్థలకు అందిస్తుంది.
ది బ్యాంక్ ఆఫ్ న్యూ యార్క్ మెల్లోన్ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లోని 100 మార్కెట్లలో ఆర్ధిక సేవలను క్లైంట్లకు అందిస్తుంది. ఇందులో సూపిరీయర్ యాసెట్ మేనేజ్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్, యాసెట్ సర్వీసింగ్, ఇష్యూయర్ సర్వీసెస్, క్లియరింగ్ సర్వీసెస్, ట్రెజరీ సర్వీసెస్ వంటివి అందిస్తుంది.
|