రాజస్థాన్‌లో విద్యార్ధులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు వీలుగా గురుకుల్ ఆన్‌లైన్ సొల్యూషన్స్ సేవలు అందించనుంది. దీనికి సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వంతో గురుకుల్ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ కమ్ ఎంప్లాయ్‌మెంట్ రెడీనెస్ స్కిల్స్ వంటివాటిని రాజస్థాన్ యువతకు గురుకుల్ శిక్షణ ఇస్తుంది.
రాజస్థాన్ కళాశాల్లో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధులు ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో అంతటి అనుభవం లేనివారు ఎక్కువగా వస్తుంటారు. వీరికి ఇందులో శిక్షణఇస్తే రిటైలింగ్, లాజిస్టిక్స్, ఫినాన్షియల్ సర్వీసెస్‌లో ఉపాధి అవకాశాలు సాధించే అవకాశం ఉంది.
రాజస్థాన్‌లోని వివిధ కళాశాలల్లో చదువుతున్న 2వేల విద్యార్ధులకు స్కిల్ డవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రస్తుత ఏడాదికి గురుకుల్ లక్ష్యంగా పెట్టుకుంది. జైపూర్‌లో ఇప్పటికే 200 మందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గురుకుల్ ప్రారంభించింది. గురుకుల్ ఇచ్చే శిక్షణ పూర్తిచేసిన వారు రాష్ట్రంలోని రిటైల్ ఔట్‌లెట్లలో ఉపాధి పొందే అవకాశం ఉందని గురుకుల్ అంటోంది.
|