మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌తో పాటుగా గ్వాలియర్‌లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పార్కులు ఏర్పాటుచేస్తున్న ఆయా ప్రాంతాల్లో భూ కేటాయింపు చేస్తామని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఐటీ పార్కుల ఏర్పాటుకు సంబంధించి జరిగిన సమావేశంలో మధ్య ప్రదేశ్ ఆర్ధిక మంత్రి రాఘవ్‌జీ, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోక్ దాస్, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్నేహలత శ్రీవాత్సవ, సీఎం సెక్రటరీ అనురాగ్ జైన్‌లు పాల్గొన్నారు. భోపాల్, గ్వాలియర్‌లలో ఏర్పాటుచేసే పార్కులకు మూడు ఎకరాల చొప్పున భూమని ప్రభుత్వం కేటాయించనుంది.
రాష్ట్ర రాజధాని భోపాల్‌లో బద్వాయ్, గ్వాలియర్‌లో గంగామాలన్‌పూర్ వద్ద ఐటీ పార్కులు ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో ఐటీ పార్కులు ఏర్పాటుకాబోతుండటం ఇదే మొదటిసారి. ఎస్టీపీఐ పార్కులను దేశవ్యాప్తంగా అనేకచోట్ల ఏర్పాటుచేశారు.
|