వినియోగదారుల కోసం కొత్త ఎల్సీడీ టీవీలను మోసర్ బేర్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. మోసర్ బేర్ కొత్తగా 8 మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ టీవీలలో హెచ్‌డీ క్వాలిటీ కలర్ ఇమేజస్, ఏ గ్రేడ్ ప్యానెల్స్, ఇంటిగ్రేటెడ్ బిల్ట్ ఇన్ టెలివిజన్ స్పీకర్స్, వర్చువల్ సరౌండ్ సౌండ్ వంటివి ఇందులో ఉన్నాయి.
భారతీయ వినియోగదారులకోసం ఈ టీవీలను రూపొందించామని మోసర్ బేర్ డొమిస్టిక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగ ఈవీపీ భాస్కర్ శర్మ చెప్పారు. భారత ఎల్సీడీ మార్కెట్‌లో తమ వాటాను వృద్ధి చేసుకుంటామని వివరించారు. తమ టీవీలలో కార్యక్రమాలు చూస్తుంటే వినియోగదారులకు పూర్తిస్థాయిలో హోం ఎంటర్‌టైన్‌మెంట్ పొందిన అనుభూతి కలుగుతుందన్నారు.
మోసర్ బేర్ కొత్త ఎల్సీడీ టీవీలు 19, 22, 26, 32, 42 అంగుళాలు, పూర్తిస్థాయి హెచ్‌డీ టీవీలు 40, 47 అంగుళాల్లో లభ్యమవుతున్నాయని వివరించారు. కొత్త ఎల్సీడీ టీవీల ధరలు రూ.20,900 నుంచి రూ.1,49,900 వరకూ ఉన్నాయని శర్మ వెల్లడించారు.
|