చెన్నై కేంద్రంగా పనిచేసే ఐటి సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన వాల్జెన్ బిజినెస్ సొల్యూషన్స్, వస్తూత్పత్తి రంగం కోసం తాజాగా చౌక ధరలకే లభించే ఇఆర్‌పి (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) సొల్యూషన్‌తో ముందుకొచ్చింది. సాఫ్ట్‌వేరే సర్వీసుగా ఉండే సాస్ మోడల్‌పై ఆధారపడిన ఈ సొల్యూషన్ ఎస్ఎమ్ఇలకు ప్రత్యేకించి వరంలాంటిది. మౌలికవసతుల రంగంలో పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ మరియు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రెడేషన్ భారాలనుంచి వినియోగదారులకు ఈ చౌకధరల మోడల్ విముక్తి కలిగించనుంది.
ఇసాస్ (ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్ యాజ్ సబ్‌స్క్రిప్షన్) మోడల్ పేరిట ప్రతిపాదిస్తున్న ఈ తాజా ఉత్పత్తి ఇఆర్‌పి సొల్యూషన్లను కస్టమర్‌కు అందుబాటులో ఉంచుతోంది. ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ కొనుగోలు చేయకుండానే ఈ సొల్యూషన్లను కస్టమర్ పొందవచ్చు. పైగా, ఆన్‌లైన్ డేటాను, సాఫ్ట్‌వేర్‌ను పొందేందుకు సేవల కోసం కస్టమర్ సబ్‌స్క్రయిబ్ చేయవచ్చు. ఇవి వాల్జెన్ సెక్యూర్ డేటా సెంటర్‌లో హోస్ట్ చేయబడి ఉంది. దీనికోసం కస్టమర్‌కు కావలిసిందల్లా ఒక సాధారణ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. కనీస సబ్‌స్క్రిప్షన్ రుసుముతో ఈ సర్వీసులను కస్టమర్ చెల్లించవచ్చు.
నెలకు కనీస మాత్రపు మొత్తంతో కస్టమర్ ఇఆర్‌పి యొక్క పూర్తి ఉపయోగాన్ని పొందవచ్చని వాల్జెన్ సంస్థ ఆపరేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ పి.ఆనంద్ చెప్పారు. కేవలం నెలకు రూ15000లతో కంపెనీలు ఈ సేవను పొందవచ్చని తెలిపారు. టెక్నాలజీ సపోర్ట్ పర్సన్‌ను బయటనుంచి హైర్ చేసుకోవడం ద్వారా కంపెనీకి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువని పేర్కొన్నారు. పైగా తమ మోడల్ కస్టమర్‌లను నిర్వహణాపరమైన చిక్కు సమస్యల నుంచి బయట పడేస్తుందని చెప్పారు.
2010 నాటికి దాదాపు రెండు వేల మంది కస్టమర్లను 100 చానెల్ భాగస్వాముల నెట్‌వర్క్‌ను చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో తాము పక్కా బిజినెస్ ప్లాన్‌తో ముందుకొచ్చామని వాల్జెన్ సంస్థ ప్రెసిడెంట్ మరియు సీఈఓ హరిహరన్ చెప్పారు. మూడేళ్లలో తమ టర్నోవర్ దేశీయ మార్కెట్లోనే వంద కోట్ల రూపాయలను దాటిందని తెలిపారు.
రాబోయే సంవత్సరంలో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను తెరిచి గ్లోబల్ కస్టమర్లను చేరే లక్ష్యంతో 25 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు పథక రచన చేశామని హరిహరన్ చెప్పారు. 125 సంవత్సరాల అనుభవం ఉన్న వాల్జెన్ సంస్థ తన ప్రమోటర్లు బి.హరిహరన్ మరియు డాక్టర్ శ్రీ శ్రీధరన్‌తో పాటు మరో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం సహాయంతో మంచి ఉత్పత్తి, సేవా అనుభవాలను కలిగి ఉంది.
|