ప్రభుత్వం సెమికండక్టర్ రంగాన్ని ఆకట్టుకోవడానికి రెండు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు రూ. 55 వేల కోట్లు పెట్టబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపుగా 14 రకాల ప్రణాళికలను తయారు చేశారు. ఇప్పటికే 1.36 లక్షల కోట్లు పెట్టారు.
ఈ తరహా పెట్టుబడులతో జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే పనులు ప్రారంభించిందని ఐటీ ప్రత్యేక కార్యదర్శి మాధవన్ నంబియార్ తెలిపారు. వాసవి టెలి ఏజెన్సీస్ రూ. 39 వేల కోట్లు, ఈపీవీ సోలార్ రూ. 4 వేల కోట్లతో సోలార్ ఫోటోవోల్టాయిక్ యూనిట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ప్రతిపాదనలు అందుకుంది. అలాగే వీడియోకాన్ కూడా ప్రతిపాదనలు పంపుతోంది. దీనిపై చర్చించడానికి సాంకేతిక నిపుణుల సమావేశం జరపనున్నారు.
|