దొరికిన సిస్టమ్‌లోకల్లా చొరబడి వారి విలువైన సమాచారాన్ని చోరీ చేసే హాకర్లకు చెక్ చెప్పేందుకు కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనా మెకఫే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం దాదాపు 465 మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధమయ్యింది.
దీంతో ప్రత్యేకమైన పరికరాలను ఏర్పాటు చేస్తోంది. ఫలితంగా హాకర్లను నిలవరించవచ్చునని వారు భావిస్తున్నారు. కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థల్లో మెకఫె రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ కొనుగోలు చేసే పరికరాలను అభివృద్ధి చేసిన తరువాత వాటిని వ్యాపార సంస్థలకు విక్రయించనున్నట్లు వివరించారు.
ఈ సంస్థ విడుదల చేసే సెక్యూరిటీ విధానం కోసం వివిధ వ్యాపార సంస్థలు ఎదురు చూస్తున్నాయి. వివిధ ప్యాకేజీల కింద సెక్యూరిటీలు విడుదుల కానున్నాయి.
|