తాను మార్కెట్లోకి విడుదల చేసిన షేర్లలో పెద్ద ఎత్తు బై బ్యాక్ చేయాలని హవ్లెట్-ప్యాకార్డ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం దాదాపు 8 బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ప్రకటించింది.
హెచ్‌పీ కంప్యూటర్లు, ప్రింటర్లను తయారు చేస్తున్న విషయం తెలిసింది. ఈ సంస్థ తన షేర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వాటి ధరలను ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సంస్థ తన షేర్లను బై బ్యాక్ చేస్తోంది.
|