ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > జీఎస్‌బీ సొల్యూషన్స్ నుంచి ఫిన్‌ప్లాన్ సాఫ్ట్‌వేర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జీఎస్‌బీ సొల్యూషన్స్ నుంచి ఫిన్‌ప్లాన్ సాఫ్ట్‌వేర్
చెన్నైకి చెందిన జీఎస్‌బీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిన్‌ప్లాన్ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించింది. ఈ సాఫ్ట్‌వేర్ ఆర్థిక స్థితిగతులను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. డబ్బుకు సంబంధించి తీసుకొనే నిర్ణయాల ప్రభావాన్ని ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా విశ్లేషించుకోవచ్చు.

కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కూడా ఉపయోగించుకునే విధంగా ఫిన్‌ప్లాన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కంపెనీ డైరెక్టర్ గిరిధర్ బెయిల్ తెలిపారు. సులభంగా ఉపయోగించగలిగే ఈ సాఫ్ట్‌వేర్ ఇంగ్లీషు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

దేశంలో ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని గిరిధర్ చెప్పారు. ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ మూడు ప్రాంతీయ భాషల్లోనే ఫిన్‌ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే అన్ని ప్రధాన ప్రాంతీయ భాషలు, విదేశీ భాషల్లో కూడా దీనిని తీసుకొస్తామని వెల్లడించారు.

బ్యాంకులు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను సమర్థమంతంగా ఉపయోగించవచ్చని చెప్పారు. దీనిని రూ.150 లక్షల పెట్టుబడితో అభివృద్ధి చేశామన్నారు. ఈ సాఫ్ట్‌వేర్ ఏడాదికి రూ.300 లక్షల ఆదాయాన్ని సృష్టించగలదని ఆశిస్తున్నామన్నారు.
మరిన్ని
ఇకపై పూణేలోనూ సత్యం కంప్యూటర్స్
హెచ్‌పీలో 8 బిలియన్ డాలర్లతో బై బ్యాక్
ఐటీలకు గోల్డ్‌మాన్, మోర్గాన్ సంస్థల భరోసా
465 మిలియన్ డాలర్లతో హాకర్స్‌కు మెకఫే చెక్
కతే పసిఫిక్ కాంట్రాక్టును దక్కించుకున్న నిట్
సెమికండక్టర్‌ సెక్టార్‌లో రూ. 55 వేల కోట్ల తాజా పెట్టుబడులు ‌