ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > రిలయన్ సరికొత్త ఆఫర్ "లైఫ్‌టైమ్ జాదూ"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రిలయన్ సరికొత్త ఆఫర్ "లైఫ్‌టైమ్ జాదూ"
FILE
ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన మొబైల్ లైఫ్‌టైమ్ వినియోగదారుల కోసం ఓ సరికొత్త ఆఫర్‌ను "లైఫ్‌టైమ్ జాదూ" అనే పేరుతో ప్రవేశపెట్టింది. కొత్తగా లైఫ్‌టైమ్ కనెక్షన్లు తీసుకునే వారు, ఇప్పటికే రిలయన్స్ లైఫ్‌టైమ్‌ను వాడుతున్నవారు సైతం ఈ జాదు ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ జాదు ఆఫర్ ప్రకారం... లైఫ్‌టైమ్ వినియోగదారులు లోకల్ కాల్‌ను నిమిషానికి యాభై పైసలు, దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకైనా ఎస్టీడీ ఛార్జీ నిమిషానికి ఒక్క రూపాయి చొప్పున కాల్ చేసుకోవచ్చు. కాగా, ఈ సరికొత్త లైఫ్‌టైమ్ జాదూ ప్యాకేజీ 550 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

ఇదిలా ఉంటే... గతంలో లైఫ్‌టైమ్ కనెక్షన్‌ను రిలయన్స్ మొబైల్ 199 రూపాయలకే విడుదల చేసింది. ప్రస్తుతం ప్రకటించిన ధరల శ్రేణిలో కాల్స్ చేసుకునేందుకు ప్రతినెలా కొత్త ఓచర్లను కొనుగోలు చేయాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ అవసరం ఉండబోదని, ఒకేసారి ఈ 550 రూపాయల ఓచర్‌ను కొనుగోలు చేసినట్లయితే... లైఫ్‌టైమ్‌దాకా ఇదే ఆఫర్ వర్తిస్తుందని రిలయన్స్ వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మైక్రోసాఫ్ట్ "లైవ్ మ్యాప్ సెర్చ్" సేవలు ప్రారంభం
ఎల్‌జీ టీవీ కొనుగోలుదార్లకు బిగ్‌ టీవీ ఆఫర్
మోటారోలాలో 3వేల ఉద్యోగాలు ఫట్..!
తగ్గుముఖం పట్టిన శాప్ సంస్థ లాభాలు
బ్లాక్‌బెర్రి బోల్డ్ ధర 299 డాలర్లు
3డి నానో ఇమేజింగ్ టెక్నాలజీతో ఎల్‌సీడీ టీవీలు