ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > నోకియా ఉద్యోగులకు ఉద్వాసన
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నోకియా ఉద్యోగులకు ఉద్వాసన
FILE
ప్రపంచ నెంబర్‌వన్ మొబైల్ తయారీ సంస్థ నోకియా తమ 600 వందల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం అమలు చేస్తోన్న పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోంచి ఉద్యోగాల్లో కోత విధించాలన్న నిర్ణయంలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఈ సందర్భంగా నోకియా అధికార ప్రతినిధి అర్జా స్యుయోమినెన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కంపెనీ ప్రణాళికల్లో భాగంగా తాము తొలగించబోయే మార్కెటింగ్ సిబ్బందిలో వందమంది ఫీన్‌లాండ్‌లోనే ఉన్నారని, మరో 130 మంది నోకియా రీసెర్చ్ విభాగం వారిని తొలగిస్తున్నట్లు తెలిపారు.

యూనియన్లతో చర్చలు జరిపిన తరువాత అసలు సంఖ్య ఎంత ఉంటుందో వెల్లడిస్తామని అర్జా స్యుయోమినెన్ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే... అంతర్జాతీయంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం ప్రభావం వల్లనే నోకియా ఉద్యోగుల తొలగింపు బాటలోకి ప్రవేశించిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నోకియా ఇప్పటికే ఫీన్‌లాండ్‌లోని తుర్కు ప్లాంట్‌ను కూడా మూసివేయడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రిలయన్ సరికొత్త ఆఫర్ "లైఫ్‌టైమ్ జాదూ"
మైక్రోసాఫ్ట్ "లైవ్ మ్యాప్ సెర్చ్" సేవలు ప్రారంభం
ఎల్‌జీ టీవీ కొనుగోలుదార్లకు బిగ్‌ టీవీ ఆఫర్
మోటారోలాలో 3వేల ఉద్యోగాలు ఫట్..!
తగ్గుముఖం పట్టిన శాప్ సంస్థ లాభాలు
బ్లాక్‌బెర్రి బోల్డ్ ధర 299 డాలర్లు