ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ఉద్దేశించిన మైక్రోసాఫ్ట్ "డ్రీమ్‌స్పార్క్" ప్రోగ్రాంను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆవిష్కరించారు. దేశంలోని సుమారు 10 మిలియన్ మందికి పైగా అర్హతగల విద్యార్థులకు ఉపయోగపడే ఈ "డ్రీమ్‌స్పార్క్" ఆవిష్కరణ ఢిల్లీ ఐఐటీ క్యాంపస్‌లో జరిగింది. కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి పురంధరేశ్వరి గౌరవ అతిథిగా పాల్గొన్నారు.డ్రీమ్‌స్పార్క్ ఆవిష్కరణ అనంతరం బిల్‌గేట్స్ మాట్లాడుతూ... ప్రజల జీవనాన్ని మెరుగుపరిచేందుకు, ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసేందుకు తాము చేయాల్సినదంతా చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, రూపకల్పన, సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ మైక్రోసాఫ్ట్ డ్రీమ్‌స్పార్క్ సౌలభ్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.తదనంతరం మంత్రి పురంధరేశ్వరి మాట్లాడుతూ... మైక్రోసాఫ్ట్ సంస్థతో తమ శాఖ "సాక్షాత్" అనే పోర్టల్‌కు కూడా ఒప్పందం కుదుర్చుకున్నదని, ఈ పోర్టల్ ద్వారా కూడా డ్రీమ్‌స్పార్క్ ఐడీని పొందవచ్చని ఆమె వెల్లడించారు. ఇ-లెర్నింగ్ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ చేయూతను కూడా ఆమె సభాముఖంగా అందరికీ గుర్తు చేశారు.అంతేగాకుండా... లక్షమంది ఐసిటి చాంఫియన్స్‌ను తయారు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌తో తమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా పురంధరేశ్వరి తెలియజేశారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |