ఇక నుంచి సినిమా టిక్కెట్లను వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం బుక్‌మైషో డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ప్రారంభమైంది. సెవెన్ టైమ్ డాట్ కామ్ తన పోర్టల్‌లో సెవెన్ టైమ్ టికెట్ కౌంటర్ పేరుతో ఈ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా 24 గంటల పాటు తమకు కావాల్సిన సినిమా టిక్కెట్లను రిజర్వు చేసుకోవచ్చు.
అంతేకాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శితమయ్యే సినిమాలు, వాటి వేళలు, ఇతరాత్రా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. కాగా, ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసిన వెంటనే.. అందుబాటులో ఉండే టిక్కెట్లను నారింజ వర్ణంలో హైలెట్ చేశారు. ఇది నెటిజన్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. |