మలేషియాలో సేవలందిస్తున్న మోటారోలా సాఫ్ట్‌వేర్ డెవలెప్‌మెంట్ కేంద్రాన్ని భారత ప్రముఖ ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్ కంపెనీ కైవసం చేసుకుంది. మోటారోలా నెట్‌వర్క్ మొబైల్ వ్యాపారంలో ఒక భాగమైన ఈ డెవలెప్‌మెంట్ కేంద్రం నెట్‌వర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తుంది.
హైదరాబాద్‌లో సత్యం టెక్నాలజీ ఇన్‌ఫ్రా వ్యాపార విభాగపు ప్రధాన అధికారి నిషిత్ మాథుర్ మాట్లాడుతూ మలేషియాలో మోటారోలా సాఫ్ట్‌వేర్ విభాగంలో ఆస్తులతో పాటు ఆ సంస్థ ఉద్యోగులు కూడా సత్యం కంపెనీ ఆధ్వర్యంలోకి వస్తారన్నారన్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో 128 మంది ఉద్యోగులున్నట్లుగా తెలిపారు.
మోటారోలా సాఫ్ట్‌వేర్ విభాగాన్ని కైవసం చేసుకోవడం ద్వారా తమ సంస్థ మరింత విస్తృతమవుతందన్నారు. అలాగే ఆసియా, పసిఫిక్, మలేషియాల్లో భారత నాలుగో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి దారుగా సత్యం సంస్థ నిలుస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. కాగా, మోటారోలాతో చేసుకున్న కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను సత్యం సంస్థ వెల్లడించలేదు. ఈ వివరాలను బహుశా.. డిసెంబర్ ఆఖరులోగా ప్రకటించవచ్చని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. |