ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > సెమీకండెక్టర్ల యూనిట్‌ ఏర్పాటుకు ఐకామ్ ధరఖాస్తు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సెమీకండెక్టర్ల యూనిట్‌ ఏర్పాటుకు ఐకామ్ ధరఖాస్తు
ఫ్యాబ్ సిటీలో సెమీకండెక్టర్ల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌కు చెందిన ఐకామ్ కంపెనీ ధరఖాస్తు చేసుకుంది. ఈ ధరఖాస్తులో ఉన్న సాంకేతిక అంశాల పరిశీలన నిమిత్తం భారత సెమీకండెక్టర్ అసోసియేషన్‌ (ఐఎస్‌ఏ)కు పంపాలని ఫ్యాబ్ సిటీకి చెందిన ఎస్‌పీవీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఎస్‌పీవీ బోర్డు సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి బి శ్యాంబాబు, ఏపీ ఇన్వెస్ట్ సీఈఓ సీఎస్ రావ్, ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐకామ్ కంపెనీతో పాటు జెనెక్స్ సంస్థ, నోయిడా సంస్థ అయిన డాల్ఫిన్ టెక్నాలజీ కంపెనీల ధరఖాస్తులను కూడా ఐఎస్‌ఏకు పంపాలని నిర్ణయించారు.

ఫ్యాబ్‌సిటీలో ఇదివరకే స్థలాలు కేటాయించిన సంస్థల వృద్ధిని కూడా ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలిసింది. కాగా, ఎక్సెల్ టెలికాం, సోలార్ సెమీకండెక్టర్ సంస్థలు ఫ్యాబ్ సిటీలో తమ యూనిట్ ద్వారా ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. అలాగే మరి కొన్ని సంస్థలు కూడా వచ్చే ఏడాది మే నెలలోగా ఉత్పత్తులను ప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మోటారోలా సాఫ్ట్‌వేర్ విభాగం సత్యం కైవసం
సినిమా టిక్కెట్ల బుకింగ్‌కు ఓ వెబ్‌సైట్
బిల్‌గేట్స్‌చే "డ్రీమ్‌స్పార్క్" ఆవిష్కరణ
ఈశాన్య భారతంలో 1000 పోస్టాఫీసుల స్థాపన
త్వరలో టెలిఫోన్ ఛార్జీల వడ్డన..!
నోకియా ఉద్యోగులకు ఉద్వాసన