హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ సత్యం కంప్యూటర్స్ కంపెనీ, యూరప్‌లో భారీ స్థాయిలో విస్తరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్‌లో సంస్థల కొనుగోళ్లపై కంపెనీ దృష్టి పెట్టినట్లు యూరప్‌లో సత్యం సంస్థ కార్యకలాపాల ప్రధాన అధికారి పీటర్ హీజ్ వెల్లడించారు.
ఫ్రాంక్‌ఫర్ట్ సమీపంలోని వీస్‌బేడన్‌లో ఉన్న సత్యం కంపెనీ యూనిట్‌ను సందర్శించేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో పీటర్ మాట్లాడారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యూరప్‌లో ప్రత్యేకించి జర్మనీలో విస్తరణ కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. ఇటీవలే తమ కంపెనీ పలు సంస్థలను హస్తగతం చేసుకుందని పీటర్ వివరించారు.
వాటిలో బ్రిటన్‌లో ఉన్న నిటోర్ గ్లోబల్ సొల్యూషన్స్, సిటీ సాఫ్ట్ పీఎల్‌సీ, బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న ఎస్ అండ్ వీ మేనేజ్‌మెంట్ కన్‌సల్టెంట్స్ సంస్థలు ఉన్నాయి. 2010 ఆర్థిక సంవత్సరంలోగా తమ సంస్థ 30 శాతం అంతర్జాతీయ లాభాలను సాధించాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు పీటర్ తెలిపారు. |