ల్యాండ్ ఫోన్ పరికరాల తయారీని ఆపేసిన తర్వాత ప్రముఖ వ్యాపార సంస్థ అయిన టాటా త్వరలో మొబైల్ హ్యాండ్‌సెట్‌ల వ్యాపార రంగంలోకి అడుగిడనుంది. జపాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌టీటీ డాకొమోతో కలిసి టాటా ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిసింది.నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగిస్తూ నాణ్యతా పరిమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ మొబైల్ హ్యాండ్‌సెట్ అభివృద్ధిని చేపట్టనుంది. అలాగే వివిధ రకాల అభిరుచులున్న వినియోగదారులను ఆకట్టుకునేలా భారీ ఎత్తున ఈ మొబైల్ తయారీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.వాటర్ ప్రూఫ్, జీపీఎస్ ట్రాకింగ్, వివిధ రకాల అప్లికేషన్‌లతో కూడి ఈ టాటా కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌లు... తయారు కానున్నాయని వివరించాయి. కాగా, టాటాలో భాగమైన టాటా టెలీలో డాకొమో గతంలో 26 శాతం వాటాలను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఇరు సంస్థల మధ్య సంబంధాలు నెలకొన్నాయి.ఈ సంబంధాలే వైర్‌లెస్ విభాగంలోకి ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రవేశించేందుకు బాటలు వేశాయి. మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీనే కాకుండా.. ఈ విభాగంలో ఇంకా మార్కెటింగ్, హ్యాండ్‌సెట్ డెవలెప్‌మెంట్, టెక్నికల్ సపోర్ట్ సర్వీసులను కూడా అందజేయనున్నాయి. |