ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > వెబ్ వీడియోస్‌లోనూ ఒబామా ప్రసంగాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెబ్ వీడియోస్‌లోనూ ఒబామా ప్రసంగాలు
Obama
FileFILE
అమెరికా అధ్యక్షునిగా పీఠాన్ని అధిష్టించిన తర్వాత బారక్ ఒబామా, తన ప్రసంగాలను ఆన్‌లైన్ వీక్షకులకు కూడా అందించాలని భావిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా నెటిజన్‌లకు ఒబామా ఈ అవకాశాన్ని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్, జాన్ ఎఫ్ కెన్నడీ, రోనాల్డ్ రీగన్‌లు తమ ప్రసంగాలను ప్రజలకు చేరవేసేందుకు వివిధ మాధ్యమాలను ఉపయోగించుకున్నారు. తాజాగా ఒబామా వెబ్ వీడియోస్ ద్వారా కూడా తన ప్రసంగాలను ప్రజలకు చేర్చి తద్వారా సరికొత్త
విధానానికి నాంది పలుకనున్నారు.

వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన అనంతరం కూడా ఒబామా వెబ్ వీడియోస్ కొనసాగుతాయని ఆయన ప్రతినిధి జెన్ సాకీ తెలిపారు. కేబినెట్ సభ్యులతో సహా ఇతర అధికారులు కూడా వెబ్ వీడియోస్‌‍‌ను ఉపయోగించుకోనున్నారని వెల్లడించారు.

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ రేడియా ప్రసంగాలున్నాయి. అయితే ఆన్‌లైన్ వీక్షకుల కోసం వెబ్ వీడియోలు లాంటివి లేవని వైట్ హౌస్ వెల్లడించింది. 2003లో బుష్ తన పదవీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఐ టోన్‌, ఆడియోల ద్వారా మాత్రమే బుష్ ప్రసంగాలను చేశారని తెలిపింది.

చికాగోలో శుక్రవారం అనువాద కార్యాలయంలో తొలి సారిగా ఒబామా నాలుగు నిమిషాల ప్రసంగాన్ని రికార్డ్ చేశారు. ఇది శనివారం యూ ట్యూబ్ ద్వారా నెటిజెన్‌లకు చేరనుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మొబైల్ హ్యాండ్‌సెట్‌ల రంగంలోకి టాటా
భారీ విస్తరణ కార్యక్రమాల్లో సత్యం కంప్యూటర్స్
సెమీకండెక్టర్ల యూనిట్‌ ఏర్పాటుకు ఐకామ్ ధరఖాస్తు
మోటారోలా సాఫ్ట్‌వేర్ విభాగం సత్యం కైవసం
సినిమా టిక్కెట్ల బుకింగ్‌కు ఓ వెబ్‌సైట్
బిల్‌గేట్స్‌చే "డ్రీమ్‌స్పార్క్" ఆవిష్కరణ