ప్రపంచవ్యాప్తంగా మొబైల్ హ్యాండ్‌సెట్ వ్యాపారం తగ్గుముఖం పట్టినట్లుగా సెల్‌ఫోన్ ఉత్పత్తి దిగ్గజం నోకియా సంస్థ వెల్లడించింది. తాజాగా విడుదలైన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మొబైల్ వ్యాపారం వృద్ధి సన్నగిల్లిందని తెలిపింది. అలాగే వచ్చే ఏడాదిలోను ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో 1.26 బిలియన్ సెల్‌ఫోన్‌ల విక్రయాలు కాగలవని నోకియా అంచనా వేయగా ప్రపంచ వ్యాప్తంగా 1.24 బిలియన్ మొబైల్ ఫోన్‌లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ లెక్కల ప్రకారం వచ్చే ఏడాదిలో టెలికాం పరికరాల మార్కెట్ వ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.హెల్సింకీలో విశ్లేషకులు టెరో కుయిట్టినెన్ మాట్లాడుతూ... వినియోగదారుల ఎలక్ట్రానిక్ పరికరాల డిమాండ్ తిరోగమనం దిశలో పయనిస్తున్నట్లు తెలిపారు. 80 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం ఈ స్థాయిలో ఏర్పడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే దాదాపు 15 దేశాల ఆర్థిక వృద్ధి 0.2 శాతం మేరకు తగ్గిందన్నారు.ఇటీవల నోకియాలో షేర్లు ఏడు శాతం మేర 9.56 యూరోలకు పడిపోయింది. ఈ స్థాయి 2004 ఆగస్టులోని గణాంకాలుగా నోకియా తన నివేదికలో వెల్లడించింది. నోకియా ఆర్థిక వ్యవహారాల ఛీఫ్ రిక్ సిమ్సన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. పురోగతి బాటలో ఉన్న మార్కెట్‌లలో పరిస్థితి బాగానే ఉందన్నారు. |