ప్రధాన పేజి > వార్తలు > ఐటీ > ఐటీ వార్తలు > టెక్నికల్ రంగంలో 1.80లక్షల ఉద్యోగాలు ఫట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టెక్నికల్ రంగంలో 1.80లక్షల ఉద్యోగాలు ఫట్
IT Jobs
FileFILE
ఇటీవల అందిన తాజా నివేదికల ప్రకారం ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో టెక్నికల్ రంగంలో త్వరలో సుమారు మరో లక్షా ఎనభైవేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో 140,422 ఉద్యోగాల కోత విధించినట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా చికాగో కేంద్రంగా పనిచేస్తున్న గ్రే అండ్ క్రిస్ట్‌మస్ ఇంక్, ఛాలెంజర్ తదితర కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధింపుపై ప్రకటనలు చేయనున్నాయి. ఈ ఏడాదిలో మూడో త్రైమాసికంలో టెక్నికల్ రంగంలో భారీగా 69,654 మంది ఉద్యోగులను తొలగించారు.

మూడో త్రైమాసికంలో తొలగించిన ఉద్యోగులు కాక అక్టోబర్ 31న సన్ మైక్రోసిస్టమ్స్ సంస్థ తొలగించిన ఉద్యోగుల సంఖ్య 6వేల మంది కావడం గమనార్హం. ఈ సంవత్సరాంతంలో మొత్తంమీద ఉద్యోగాల కోత లక్షా ఎనభై వేలు ఉండవచ్చన్నది అంచనా. ఇదిలా ఉంటే.. ఇక 2007లోను టెక్నికల్ రంగలో లక్షా ఏడు వేల ఉద్యోగాలకు కోత విధించారు.

ఈ విషయంపై ఛాలెంజర్ సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఛాలెంజర్ మాట్లాడుతూ... గత ఏడాదిలో గృహ వ్యాపార మార్కెట్ పడిపోవడం ఆర్థిక సంక్షోభానికి మూల కారణంగా వివరించారు. ఆ మార్కెట్ ప్రభావం తాలూకు నీలి నీడలు త్వరితగతిన వాణిజ్య మార్కెట్లకూ చేరుకుందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జర్మనీలో ఐటీ సంస్థలపై విప్రో, టీసీఎస్ కన్ను
తగ్గుముఖం పట్టిన మొబైల్ హ్యాండ్‌సెట్ వ్యాపారం
వెబ్ వీడియోస్‌లోనూ ఒబామా ప్రసంగాలు
మొబైల్ హ్యాండ్‌సెట్‌ల రంగంలోకి టాటా
భారీ విస్తరణ కార్యక్రమాల్లో సత్యం కంప్యూటర్స్
సెమీకండెక్టర్ల యూనిట్‌ ఏర్పాటుకు ఐకామ్ ధరఖాస్తు