రాంచీలోని బిర్సా అగ్రికల్చరల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో నవంబర్ 21 నుంచి ఐటీ సదస్సులు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిలో ఐటీ పాత్రపై ప్రధానంగా చర్చించనున్నాయి. సుమారు 200 మందికి పైగా ఐటీ నిపుణులు హాజరుకానున్నట్లు తెలిసింది.రాంచీలో ఈ సదస్సు నిర్వహాక కార్యదర్శి బీకే ఝా మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డెవలెప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సడ్ కంప్యూటింగ్ సంస్థలు, న్యూఢిల్లీ నుంచి భారతీయ వ్యవసాయ గణాంకాల పరిశోధన సంస్థలు వంటి ప్రధాన సంస్థల నుంచి నిపుణుల హాజరుకానున్నారని తెలిపారు.గ్రామీణాభివృద్ధి, వ్యవసాయంలో ఐటీ పాత్రపై చర్చించడంతో పాటు గ్రామ ప్రాంతాలను ఆర్థికపరంగా మరింత బలోపేతం చేయడానికి తగిన మద్దతు, సాంకేతికపరమైన అవకాశాలు, విద్య, పరిశోధన, కృషి వంటి అంశాలపై కూడా ప్రధానంగా సమీక్షించనున్నట్లు ఝా తెలిపారు.ఇదిలా ఉంటే 10 రాష్ట్రాల్లో ప్రధానమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి కూడా నిపుణులు ఈ సదస్సుకు రానున్నట్లు సమాచారం. |