భారత్‌కు ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన ఇన్ఫోసిస్ బీపీఓ.. గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికైంది. సింగపూర్‌లో నిర్వహించనున్న రెండో ఆసియా బిజినెస్ కంటిన్యూయిటీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ అవార్డును ఇన్పోసిస్ స్వీకరించనుంది.తన బీపీఓ విభాగాన్ని విస్తృతం చేయడమే కాకుండా... ఆర్థిక సంక్షోభ ప్రభావం సంస్థపై పడనీకుండా ఇతర బీపీఓ సంస్థలతో పరస్పర సహకార ఒప్పందాలు చేసుకోవడం తద్వారా ఇన్ఫోసిస్ బీపీఓ కంపెనీ తన సామర్థ్యాన్ని పెంచుకుంది. దీంతో ప్రతిష్టాత్మకమైన 'గ్రూప్ ఎక్స్‌లెన్స్' అవార్డుకు ఎంపికైంది.పైగా ఇంతటి అత్యున్నత అవార్డుకు ఎంపికైన బీపీఓ రంగంలో తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ సంస్థ రికార్డు సృష్టించింది. దీనిపై ఇన్ఫోసిస్ బీపీఓ ఎండీ, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ చౌదరి మాట్లాడుతూ... అవార్డుకు ఎంపికైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని కొనసాగించే విధానాల్లో నాణ్యతను, కీలక అంశాలను ఎంచుకున్న తమ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు తాము ఎంపికైనట్లు భావిస్తున్నామన్నారు. |