దేశంలో రెండో అతిపెద్ద సీడీఎంఏ టెలికాం ఆపరేటర్ టాటా టెలీసర్వీసెస్ జీఎస్ఎం సేవలు కూడా ప్రారంభించింది. జపాన్‌కు చెందిన టెలికాం సేవల సంస్థ ఎన్టీటీ డొకోమోతో కలిసి దేశంలో జీఎస్ఎం సేవలు ప్రారంభిస్తున్నట్లు టాటా టెలీసర్వీసెస్ బుధవారం వెల్లడించింది.
టాటా టెలీ జీఎస్ఎం సేవలు టాటా- డొకోమో బ్రాండ్‌తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. దక్షిణ భారతదేశంలో ఈ నెలాఖరుకు టాటా- డొకోమో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవతాయి. అనంతరం దేశ పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభిస్తారు.
దేశంలో జీఎస్ఎం సేవలు ప్రారంభించడంపై టాటా టెలీసర్వీసెస్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. దేశవ్యాప్తంగా టాటా టెలీసర్వీసెస్ జీఎస్ఎం సేవలు ఈ ఏడాది చివరికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా విలేకరులతో చెప్పారు.
ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్స్ దేశంలో సీడీఎంఏ, జీఎస్ఎం రెండు రకాలు సేవలు అందిస్తోంది. రిలయన్స్ తరువాత రెండు రకాల సేవలు అందిస్తున్న సంస్థగా టాటా టెలీసర్వీసెస్ నిలిచింది. |