ఖాతాల కుంభకోణంతో సంక్షోభంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కోసం నిధులు సేకరించేందుకు టాటా క్యాపిటల్, ఐడీఎఫ్‌సీతో ఆ కంపెనీ కొత్త యజమాని టెక్ మహీంద్రా ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా రూ.550 కోట్ల నిధులు సేకరించింది.
డిబెంచర్‌లు జారీ చేయడం ద్వారా టెక్ మహీంద్రా ఈ నిధులు సేకరించింది. ఈ డిబెంచర్‌లను సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌ను కొనుగోలు చేసిన వెంచర్‌బే కన్సల్టెంట్స్ షేర్లగా మార్చుకోవచ్చు. టెక్ మహీంద్రా సత్యం కొనుగోలు ప్రక్రియను వెంచర్‌బే ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సత్యం కంప్యూటర్స్ కోసం టెక్ మహీంద్రా వివిధ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ, ఇతర ఆర్థిక సంస్థల వద్ద నుంచి రూ.1450 కోట్ల నిధులు సేకరించింది. ఈ నిధులకు వడ్డీ రేటు 10 శాతం. దీనిలో కొన్ని నిధులను సత్యం కొనుగోలుకు ఉపయోగించారు. |