ప్రముఖ అంతర్జాతీయ సెల్‌ఫోన్ తయారీ దిగ్గజం నోకియా కంపెనీ ఈ రోజు మూడు రకాల కొత్త మోడల్ ఫోన్‌ల హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో సరికొత్త టచ్-స్క్రీన్ మోడల్‌ను కూడా విడుదల చేసింది. 5530 ఎక్స్‌ప్రెస్ మోడల్‌గా విడుదల చేసిన హ్యాండ్‌సెట్‌ను మూడో త్రైమాసికంలో ట్యాక్సులు కాకుండా 280 అమెరికా డాలర్లకు విక్రయిస్తామన్నారు. మిగిలిన ఇతర రెండు ఫోన్‌లు ఈ72, 3710 మోడళ్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది.గతంలో వాణిజ్య ఫోన్‌గా మార్కెట్లోకి విడుదలైన ఈ 71కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా ఈ 72ను విడుదల చేశారు. ఇక 3710 ఫోల్డ్ మోడల్‌గా అందించారు. మూడో త్రైమాసికంలో ఈ72ను టాక్సులు కాకుండా 350 యూరోలకు, అలాగే నాలుగో త్రైమాసికంలో 3710 మోడల్‌ను టాక్సులు కాకుండా 140 యూరోలకు విక్రయిస్తామని నోకియా తెలిపింది. |