అంతర్జాతీయ మొబైల్ పరికరం గుర్తింపు(ఐఎమ్ఈఐ) సంఖ్య లేని సెల్ ఫోన్ల దిగుమతిపై భారత ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఈ విషయాన్ని విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఐఎమ్ఈఐ సంఖ్య వలన మొబైల్‌ఫోన్ యూజర్‌ను తేలికగా గుర్తించవచ్చు. విదేశాలనుంచి దిగుమతి చేసుకునే ఈ మొబైల్‌ఫోన్ హ్యాండ్‌సెట్‌కు ఐఎంఈఐ నంబర్లు ఉండవు. ఉన్నాకూడా అన్నీ సున్నాలే ఉంటాయి. దేశంలో ఎక్కువగా చైనా దేశంనుంచి దిగుమతి అయిన మొబైల్ ఫోన్లే చాలామంది వాడుతున్నారని, ఇలాంటి మొబైల్ ఫోన్ల వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, దీంతో వీటిని నిషేధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. |