అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా యాంటీ-ఔట్‌సోర్సింగ్ విధానాలు పెద్దగా ప్రభావం చూపినట్లు లేదు. ఎందుకంటే.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన 10 మిలియన్ డాలర్ల బీపీఓ ఒప్పందాన్ని భారత్‌కు చెందిన రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ బీపీఓ కైవసం చేసుకుంది.ఇన్ఫోసిస్ కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం డేటా ప్రాసెసింగ్‌గా బ్యాక్-ఎండ్-సపోర్ట్ కోసం ఇన్ఫోసిస్‌తో మైక్రోసాఫ్ట్ మూడు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. భారత్‌లో మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టుల కింద 5వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ఎక్కువగా బెంగళూరు కేంద్రంగా పనిచేసే సంస్థల్లో ఉన్నాయి. ఇటీవలే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తోను ఐదు సంవత్సరాల ఔట్‌సోర్సింగ్ ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ కుదుర్చుకుంది. అదలా ఉంచితే ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో భాగమైన ఇన్ఫోసిస్ బీపీఓ కంపెనీ త్వరలో అల్కాటెల్-ల్యూసెంట్ నుండి మరో పెద్ద ఒప్పందాన్ని కైవసం చేసుకోనున్నట్లు సమాచారం.మూడేళ్ల పాటు చేసుకునే ఈ ఒప్పందం ఖరీదు సుమారు 15 మిలియన్‌ల డాలర్లు ఉండవచ్చని అంచనా. అయితే యూరోపియన్ టెలికాం దిగ్గజమైన అల్కాటెల్-ల్యూసెంట్ సంస్థతో తమ కంపెనీ ఒప్పందం చేసుకునే విషయంపై వ్యాఖ్యానించేందుకు ఇన్ఫోసిస్ బీపీఓ నిరాకరించింది. |