దేశంలోని గ్రామీణ మార్కెట్‌పై టెలికాం ఆపరేటర్లు దృష్టి సారించడంతో 2013 కల్లా 771 మిలియన్‌ల కన్నా ఎక్కువగా మొబైల్ వినియోగదారులు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వార్షిక వృద్ధి రేటు 14.3 శాతం మేరకు ఉండవచ్చని అధ్యయన సంస్థ గార్ట్‌నర్ వెల్లడించింది.2009 లో మొబైల్ వినియోగదారుల సంఖ్యం 452 మిలియన్‌లకు చేరుకుందని.. ఇదే తరహాలో వృద్ధి చెందితే ఈ సంఖ్య 771 మిలియన్‌లకు చేరుకోవడం తథ్యమని గార్ట్‌నర్ అంచనా వేస్తోంది. ప్రస్తతం భారతీయ మొబైల్ పరిశ్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో విక్రయాలు కొంత మేరకు మందగించాయి.ఇప్పడు స్వల్పంగా ఒడిదుడుకులకు లోనయినప్పటికీ.. రానున్న మూడేళ్లలో ప్రస్తుతమున్న రేటు రెండు రెట్లు పెరిగిపోతుందని గార్ట్‌నర్ వివరించింది. గ్రామీణ మార్కెట్‌పై కూడా ఆపరేటర్ల దృష్టి పెట్టడమే దీనికి కారణమని గార్ట్‌నర్ సీనియర్ పరిశోధన విశ్లేషకులు మధుసూదన్ గుప్తా వెల్లడించారు.2009 లో 38.9 శాతం మేరకు వృద్ధి చెందేలా మొబైల్ మార్కెట్ ప్రణాళిక చేసింది. ఇదే తరహాలో 2013 కల్లా ఇది 63.5 శాతానికి చేరుకోవాలని అంచనా వేస్తోంది. ఇప్పటికే టెలికాం ఆపరేటర్ దిగ్గజాలు గ్రామీణ మార్కెట్‌పై దృష్టి సారించగా.. ఈ మార్కెట్‌ను మరింతగా ఆకట్టుకోవడానికి తక్కువ ధర హ్యాండ్‌సెట్లతో దేశవాళీ మొబైల్ హ్యాండ్‌సెట్ రంగంలోకి ప్రముఖ ఎలక్ట్రానిక్ మరియు లోకల్ కన్‌స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలు అడుగుపెడుతున్నాయి. దీంతో ఈ మొబైల్ ప్రపంచంలో పోటీ తట్టుకునేందుకు వాల్యూ యాడెడ్ సేవలను ప్రవేశపెట్టారు. ఒకరకంగా ఈ సేవలు వచ్చిన తర్వాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు భారీగా పెరిగారు. అదలా ఉంచితే.. ప్రస్తుతం భారత్‌లో ఉన్న వార్షిక వృద్ధి రేటును బట్టి 2013 కల్లా 30 బిలియన్ డాలర్లకు మించిన ఆదాయం ఈ మార్కెట్ పొందనుందని గార్ట్‌నర్ తన నివేదికలో పేర్కొంది. |