ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » స్వాతంత్ర్యదినోత్సవం: పిల్లలకు ఆన్‌లైన్ గేమ్ (IT | Independence day | Online game for kids | 7seas technoligies | Sankar | Indian Heroes)
 
ఆగస్ట్ 15న 62వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌కు చెందిన 7సీస్ టెక్నాలజీస్ లిమిటెడ్ పిల్లల కోసం ఆన్‌లైన్ గేమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఓ ఇండిపెండెంట్ ఐపీ- ఆధారిత క్రీడల అభివృద్ధి కంపెనీగా పేరొందిన 7సీస్ టెక్నాలజీస్.. ఈ ఆన్‌లైన్ గేమ్‌ను 'ఇండియన్ హీరోస్' పేరిట ప్రారంభించింది.

డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఆన్‌లైన్‌రియల్‌గేమ్స్‌డాట్‌కామ్ అనే ఆన్‌లైన్ గేమింగ్ పోర్టల్‌లో ఈ గేమ్ అందుబాటులో ఉంటుందని 7సీస్ కంపెనీ తెలిపింది. తొలి గేమ్.. ఒక ఫజిల్ తరహాలో పదవిన్యాసంతో కూడి ఉంటుంది. ఈ పదాలు దేశ స్వాతంత్ర్య సమర వీరులు మరియు స్వాతంత్ర్యదినోత్సవానికి సంబంధించి ఉంటాయి.

రెండో గేమ్.. క్రాస్ వర్డ్ ఫజిల్ ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మూడో గేమ్.. చిత్రాలతో కూడిన ఫజిల్ ఉంటుంది. ఈ చిత్రాలను చక్కగా సరిగా అమర్చాల్సి ఉంటుంది. ఇక నాలుగోది... రంగులతో కూడినది. స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ఓ రంగుల ఛాయా చిత్రాన్ని గీయాల్సి ఉంటుంది.

ఐదో గేమ్ కూడా చిత్రాల ఫజిల్ రూపంలోనే దాదాపు ఉంటుంది. కాకపోతే.. దేశ నేతలకు సంబంధించిన చిత్రాలుంటాయి. ఆరో గేమ్.. స్వేచ్ఛ కాపాడే యోధుల కోసం శోధించాల్సి ఉంటుంది. దీని ద్వారా అత్యధిక స్కోరు వస్తుంది. ఈ ఆరో దశ గేమ్ పూర్తయితే.. మూడు రంగుల జండా మన కళ్ల ముందు ఆన్‌లైన్‌లో ఆవిష్కృతమవుతుంది.

7సీస్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ మారుతీ శంకర్ మాట్లాడుతూ, ఇలాంటి తరహా ఆన్‌లైన్ గేమ్స్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ గేమ్‌లో విజేతలుగా నిలిచిన 100 మందికి ఓ ప్రత్యేక బహుమతిని అందజేసే కార్యక్రమాన్ని తాము చేపట్టినట్లు శంకర్ వెల్లడించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.