ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » స్ట్రోన్‌టియమ్ కొత్త మెమరీ మాడ్యూళ్ల విడుదల (IT | Strontium tecnologies | New Memory modules | Vivian Singh | CPU)
సింగపూర్‌కు చెందిన ప్రముఖ రామ్ తయారీ సంస్థ స్ట్రోన్‌టియమ్ టెక్నాలజీ.. డెస్క్‌టాప్ మరియు ల్యాప్‌టాప్‌ల కోసం కొత్త మెమరీ మాడ్యూళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒకే సమయంలో వివిధ రకాల పనులను నిర్వహించే డ్యూయల్, మల్టీకోర్ సీపీయూలకు 4జీబీ డీడీఆర్3 1333 మెగాహెట్జెస్ మరియు 4జీబీ డీడీఆర్2 800 మెగాహెట్జెస్ వంటి రెండు రకాల మెమరీ మాడ్యూళ్లను విడుదల చేశారు.
స్ట్రోన్‌టియమ్ టెక్నాలజీ సీఈఓ వివియాన్ సింగ్ మాట్లాడుతూ, క్లిష్టమైన అప్లికేషన్‌లు సులువుగా నడవడానికి.. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అతి తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే అధిక సామర్థ్యం గల మెమరీ అవసరం అవుతుందన్నారు.
ఈ అవసరాలకు అనుగుణంగా.. తాము సింగిల్ మాడ్యూల్‌లో ఉన్న 4జీబీ డీడీఆర్3తో ముందుకు వచ్చినట్లు వివరించారు. స్ట్రోన్‌టియమ్ టెక్నాలజీ ఇండియా మేనేజర్ అజయ్ కోగ్తా మాట్లాడుతూ, తమ ఛానెల్ భాగస్వాముల ద్వారా స్ట్రోన్‌టియమ్ 4జీబీ డీడీఆర్3 మరియు డీడీఆర్2 మాడ్యూళ్లు లభ్యమవుతాయన్నారు.
కాగా, విస్తృతమైన స్టోరేజీ సామర్థ్యంతో కూడిన రామ్ ఆఫర్లతో స్ట్రోన్‌టియమ్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. అన్ని స్ట్రోన్‌టియమ్ మెమరీ మాడ్యూళ్లు.. ప్రముఖ నోట్‌బుక్ మరియు డెస్క్‌టాప్ బ్రాండ్‌లలో లైఫ్‌టైమ్ వారంటీతో రానున్నాయి.