ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » వికీపిడియా ఐఫోన్ అప్లికేషన్ విడుదల (IT | Wikipedia | iPhone application launches | Wikimedia | Jay Walsh)
 
File
FILE
స్మార్ట్ ఫోన్‌లలో ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపిడియా యాక్సెస్ అయేందు కోసం కొత్త ఐఫోన్ అప్లికేషన్‌ను విడుదల చేసినట్లు ప్రముఖ వెబ్‌సైట్ కంపెనీ వికీపిడియా ప్రకటించింది. ఐఫోన్ వినియోగదారులకు చేరువగా వెళ్లేందు కోసం ఈ అప్లికేషన్‌ను విడుదల చేసినట్లు వికీపిడియా తెలిపింది.

వికీపిడియాకు చెందిన స్వచ్ఛంద సంస్థగా పేరొందిన వికీమీడియా.. మార్కెట్లో లభ్యమయ్యే ఐఫోన్‌ల కోసం ఈ ఉచిత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ ఆపిల్స్ ఆన్‌లైన్ ఆప్ స్టోర్ వద్ద లభ్యమవుతుంది. వికీపిడియా వ్యవస్థాపక ప్రతినిధి జే వాల్ష్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా మొబైల్ పరికరాల వృద్ధిని అందరూ గుర్తిస్తారన్నారు.

ఉచిత జ్ఞాన విస్తరణకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. వీక్షకులకు దగ్గరగా చేరడానికి తాము ఏదైనా చేస్తామన్నారు. 30 మంది కన్నా ఎక్కువ సిబ్బందితో వికీమీడియా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కనుక వికీపిడియా సాఫ్ట్‌వేర్‌పై ఇప్పటికే పనిచేసిన అమెరికా డెవలపర్‌తో ఒప్పందం చేసుకున్నారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.