ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » హెచ్‌పీ లేజర్ మోడళ్లకు మూడేళ్ల వారంటీ (IT | HP Laser Printers | 3yrs Warranty | Energy savings)
 
ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ తయారీ సంస్థ హెవ్లెట్ పాకార్డ్ (హెచ్‌పీ) కంపెనీ.. తమకు చెందిన కొన్ని రకాల లేజర్ మోడళ్ప్రింటర్లకు మూడేళ్ల వారంటీని ప్రవేశపెట్టింది. మార్కెట్లో అత్యధికంగా విక్రయించబడిన తమ కంపెనీకి చెందిన నాలుగు రకాల ప్రింటర్లు.. లేజర్ జెట్ ఎం1522ఎంఎఫ్, సీపీ1215ఎన్, పీ2035ఎన్, పీ2055డీలకు ఏడాది వారంటీని.. హెచ్‌పీ మూడేళ్లకు పొడిగించింది.

జూలై 25 నుంచి సెప్టెంబర్ 30, 2009 వరకు.. ఈ మధ్య కాలంలో.. తాము ఎంపిక చేసిన లేజర్ ప్రింటర్లను కొనుగోలు చేసిన వారికి గడువు పెంచిన వారంటీ పథకం లభిస్తుందని హెచ్‌పీ కంపెనీ తెలిపింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి 15 రోజుల్లోపు వినియో
గదారులు హెచ్‌పీ వెబ్‌సైట్‌లో రిజిష్టర్ చేయించడం ద్వారా కూడా పొందవచ్చని వివరించింది.

అదనంగా, ఈ పథకంతో పాటు హెచ్‌పీ కంపెనీ.. పవర్ యువర్ గ్రోత్ హెచ్‌పీ పేరిట కొత్త లేజర్ జెట్ ప్రచారాన్ని చేపట్టింది. తాము అందిస్తున్న ప్రింటర్ల ద్వారా ఎంత పొదుపు చేయవచ్చో వినియోగదారులకు తెలిపేందుకు ఈ విన్నూత్న ప్రచారాన్ని హెచ్‌పీ చేపట్టింది. అలాగే హెచ్‌పీ కార్బన్ ఫూట్‌ప్రింట్ కాలిక్యులేటర్ పేరిట ఒక పరికరాన్ని వినియోగదారులకు పరిచయం చేయనుంది.

పోటీలో ఉన్న ఇతర మోడళ్ల ప్రింటర్లతో తాము తయారు చేస్తున్న లేజర్ ప్రింటర్ల ద్వారా 174 శాతం మేరకు ఇంధన పొదుపు చేయవచ్చని హెచ్‌పీ ప్రకటిస్తోంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.