ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » కొత్తతరం 'చిప్‌'లపై ఇంటెల్ దృష్టి (IT | News | Next Generation chips | Intel | 45 Nano Metre | Gulf town | Six core processor)
 
ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు మరియు సర్వర్‌ల కోసం వెస్ట్‌మియర్ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా కొత్తతరం చిప్స్ తయారు చేయడంపై ప్రముఖ సంస్థ ఇంటెల్ దృష్టి పెట్టింది. 2010లో వచ్చే సిస్టమ్స్ కోసం కొత్త తరం చిప్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఇంటెల్ ప్రణాళిక చేస్తోంది.

ఈ టెక్నాలజీలో తొలుత 32నానో మీటర్ (ఎన్ఎం) ఆధారిత అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్‌ను 2010 తొలి త్రైమాసికంలో విడుదల చేయాలని ఇంటెల్ చూస్తోంది. ఈ ప్రాసెసర్లపై ఇప్పటికే.. వివిధ రకాల పరిశీలనలు జరిగాయి. వెస్టమియర్ ఆర్కిటెక్చర్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని పరిచయం చేసే దిశగానే ఈ 32ఎన్ఎం మార్క్ ప్రాసెసర్‌ల కన్నా అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్‌ను ఇంటెల్ విడుదల చేయనుంది.

ఇప్పటి వరకు 'డ్యూయెల్ కోర్' ప్రాసెసర్‌తో ప్రారంభించిన ఇంటెల్.. ఇప్పుడు హై ఎండ్ సిక్స్ కోర్ ప్రాసెసర్‌గా.. కోడ్‌నేమ్‌గా 'గల్ఫ్‌టౌన్' పేరిట విడుదల చేయనుంది. ఇప్పటికే మార్కెట్లో లభించే ప్రాసెసర్‌ల కన్నా రెట్టింపు వేగంతో పాటు మరిన్ని ఉపయోగాలతో 45 ఎన్ఎం ప్రాసెస్‌ను ఇంటెల్ ఉపయోగించనుంది.

కాగా, ప్రాథమిక వెస్ట్‌మియెర్ చిప్‌లు.. 4ఎంబీ కాష్ మెమరీతో డ్యూయెల్ కోర్ సీపీయూల తరహాలో ఉంటాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ మెమరీ కంట్రోలర్ ఉంటుంది. కొన్ని అంశాలు పాత చిప్‌లతో పోలిక ఉన్నప్పటికీ.. పనిచేసే తీరులో చాలా తేడా కనబడుతుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.