ఐటీ వార్తలు | కథనాలు
ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » ఛానెల్ మీట్‌లను నిర్వహించనున్న జీనియస్ (IT | Channel Meets | Genius | KYE Systems | Sandeep Ramani)
 
ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార సంస్థ అయిన జీనియస్ కంపెనీ వివిధ నగరాల్లో ఛానెల్ మీట్‌ను నిర్వహిస్తోంది. తొలి విడతగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఆగస్ట్ 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ఛానెల్ మీట్‌ను జీనియస్ ఏర్పాటు చేసింది.

రెండవ విడతగా.. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో.. మూడో విడతలో.. అగ్రస్థానంలో ఉన్న ఐదు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఛానెల్ మీట్‌లను నిర్వహించేలా జీనియస్ ప్రణాళిక చేసింది. కేవైఈ సిస్టమ్స్ ఓబీఎం సేల్స్ విభాగపు ఇండియా మేనేజర్ సందీప్ రమణి విలేకరులతో మాట్లాడారు.

భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి ఈ ఛానెల్ మీట్‌లు తమకు వచ్చిన గొప్ప అవకాశంగా తెలిపారు. అలాగే భారత మార్కెట్ భవిత ఎలా ఉంటుందనే దానిపై కూడా ఈ మీట్‌లో చర్చిస్తున్నట్లు వివరించారు. కాగా, సరికొత్త తాజా ఆఫర్లతో ఈ ఛానెల్ మీట్ ద్వారా తమ ఛానెల్ భాగస్వాములను సంతృప్తిపరచడం కూడా తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు వ్యాఖ్యానించారు.

కాగా, ప్రస్తుతం ఒక్కో ప్రాంతం నుంచి 150పైగా భాగస్వాములు వచ్చే అవకాశం ఉందని జీనియస్ భావిస్తోంది. తమ కంపెనీకి చెందిన డిజికామ్‌లు, వెబ్‌కామ్‌లు, మౌస్‌లు, టాబ్లెట్లు వంటి తాజా ఉత్పత్తులను ఈ ఛానెల్ మీట్ ద్వారానే జీనియస్ విడుదల చేస్తోంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.