ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ.. డెల్ ఇండియా.. బెంగుళూరులో ప్రధాన స్టోర్‌ను ప్రారంభించింది. సుమారు 1,300 గజాల స్థలంలో నిర్మించిన ఈ స్టోర్‌లో ఇన్‌స్పిరోన్, స్టూడియో, ఏలియన్‌వేర్, ఆడమో తదితర ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులు మరియు వాటి సంబంధిత పరికరాలు ఇక్కడ విస్తృత స్థాయిలో లభ్యమవుతాయి.
డెల్ ప్రారంభించిన ఈ స్టోర్.. తొలిసారిగా వినియోగదారుల సర్వీసు కేంద్రంగా కూడా పనిచేస్తుంది. ఈ కేంద్రం ద్వారా వినియోగదారులు వాల్యూ యాడెడ్ సేవలు లేదా సాంకేతిక అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారాలను పొందవచ్చు.
డెల్ ఇండియా కన్‌స్యూమర్ సేల్స్ డైరెక్టర్ మరియు జనరల్ మేనేజర్ మహేశ్ భల్లా మాట్లాడారు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులతో గత ఏడాది కాలంగా వినియోగదారుల మార్కెట్లో తమ ఉనికిని మరింతగా చాటేందుకు కృషి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలను విస్తరించడాన్ని తాము ఇంకా కొనసాగిస్తామన్నారు.