భారత ఐటీ సేవల సంస్థ మహీంద్రా సత్యం.. కేవలం నాలుగు నెలల్లో 32 కొత్త క్లయింట్లను పొందినట్లు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇందులో పెద్ద క్లయింట్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. కొంత మంది పెద్ద క్లయింట్లను తాము గతంలో కోల్పోయినప్పటికీ.. తాజా క్లయింట్ల రాకతో ఆ లోటు పూడిపోయినట్లు వివరించారు.
సత్యం కంపెనీకి చెందిన మధ్యప్రాచ్య, యూరప్, భారత్, ఆసియా పసిఫిక్ ప్రాంతాల అధ్యక్షుడు అతుల్ కున్వార్ మాట్లాడారు. గతంలో తాము కోల్పోయిన క్లయింట్లలో ఇటీవలే కొంత మంది క్లయింట్లు తిరిగి వచ్చారని.. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.
కాగా, సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌గా పేరొందిన ఈ కంపెనీకి ప్రస్తుతం 420 మంది క్లయింట్లు ఉన్నారు. సత్యం మాజీ ఛైర్మన్ రామలింగ రాజు వ్యవహారం బయటపడిన తర్వాత.. పుంజుకునేందుకు తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. అంతకుముందు ఈ కంపెనీలో ఈ ఏడాది జనవరిలో 480 మంది క్లయింట్లు ఉన్నారు.
ఏప్రిల్‌లో నిర్వహించిన వేలంలో సత్యం కంపెనీని టెక్ మహీంద్రా హస్తగతం చేసుకుంది. ప్రస్తుతం రిజ్వర్ బెంచ్‌లో ఉన్న ఉద్యోగుల సంఖ్య కూడా 7వేలకు తగ్గింది. గతంలో రిజర్వ్ బెంచ్‌లో జూలైలో 8,500 మంది ఉండేవారు.