ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » భారతీ- ఎంటీఎన్ డీల్‌లో మా ప్రమేయం లేదు: రాజా (Bharathi | MTN | Deal | Not involved | Raja | Communication department | Finance ministry department)
టెలికాం దిగ్గజాలు.. భారతీ ఎయిర్‌టెల్ మరియు దక్షిణాఫ్రికాకు చెందిన ఎంటీఎన్‌ల మధ్య ప్రతిపాదిత 23 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కమ్యూనికేషన్ శాఖ ప్రమేయం లేదని కమ్యూనికేషన్స్ మరియు ఐటీ మంత్రి ఏ రాజా వెల్లడించారు. ఈ ఒప్పందం తమ పరిధిలో జరగడం లేదని ఆయన తెలిపారు.
ఈ ఒప్పందానికి సంబందించిన వ్యవహారాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తోందన్నారు. ఈ ఒప్పందానికి మద్దతు సంబంధిత అంశం ఇప్పుడప్పడే తెరపైకి రాకపోవచ్చన్నారు. ఏం జరిగినా.. త్వరలోనే ఈ ఒప్పంద అంశం తమ ముందుకు వస్తుందని.. అప్పుడు దీని గురించి చూద్దామన్నారు.
కాగా, ఈ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వ అధికారులతో దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి చెందిన సీనియర్ ఖజానా విభాగపు ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. అలాగే ఈ దక్షిణాఫ్రికా బృందం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లకు చెందిన అధికారులతోను భేటీ అయ్యారు.
అంతకుముందు.. ఎంటీఎన్‌లో 36శాతం వాటాలను విక్రయించాల్సిందిగా భారతీ ప్రతిపాదించింది. దీనికి ప్రత్యామ్నాయంగా భారతీ... తమ కంపెనీకి చెందిన సగం భాగం వాటాదారులను ఇచ్చేవిధంగా ఎంటీఎన్‌కు ప్రతిపాదించింది.