ప్రధాన పేజి » వార్తలు » ఐటీ » ఐటీ వార్తలు » పార్ట్‌నర్ ఇన్ ప్రోగ్రెస్ అవార్డుకు ఇన్ఫోసిస్ ఎంపిక (Partner in progress | Award | Infosys | select | Sears Holdings Corporation | Sandeep Dadlani)
పార్ట్‌నర్ ఇన్ ప్రోగ్రెస్ అవార్డుకు ఇన్ఫోసిస్ ఎంపిక
సియర్స్ హోల్డింగ్ కార్పొరేషన్ నుంచి 2008 'పార్ట్‌నర్ ఇన్ ప్రోగ్రెస్' అవార్డును ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కైవసం చేసుకుంది. అత్యున్నత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు మరియు ఔట్‌స్టాండింగ్ క్లయింట్ మద్దతు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుకు తగినదిగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కంపెనీని ఎంపిక చేసినట్లు సియర్స్ హోల్డింగ్ కార్పొరేషన్ తన ప్రకటనలో తెలిపింది.
ప్రతి ఏడాది ఈ అవార్డును కంపెనీ నాణ్యతా ప్రమాణాల ఆధారంగా అందిస్తారు. నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలు, అప్లయన్సెస్, మార్కెటింగ్ పరికరాలు, సౌకర్యాలు, డిజైన్, టెక్నాలజీ వంటి వాటిని అందించే గ్రూప్ ఆఫ్ సప్లయర్ కంపెనీలను ఈ అవార్డు కోసం ఎంపిక చేసుకోవడం జరిగింది.
ఇన్ఫోసిస్ ఉపాధ్యక్షుడు, రీటైల్‌కు క్లయింట్ సర్వీసుల ప్రధాన అధికారి సందీప్ దద్లానీ మాట్లాడుతూ, మూడో సారి వరుసగా సియర్స్ కార్పొరేషన్ తమ సంస్థకు చెందిన ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. సియర్స్ అసోసియేట్లచే పంపబడిన నామినేషన్‌ల ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.